- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyderabad సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు
దిశ, కడప : మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను భారీ పోలీసు బందోబస్తు మధ్య హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలించారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఏ2 సునీల్ కుమార్ యాదవ్, ఏ3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు బెయిల్‌పై ఉన్న ఏ1 గంగిరెడ్డి, ఏ4 అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరిని వేరు వేరుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.వీరిని శుక్రవారం ఉదయం హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారించనున్నారు.
కాగా మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందారెడ్డి 2019 మార్చి 15న తన స్వగృహంలోనే దారుణ హత్యకు గురైన విషయం విధితమే. విచారణ నత్తనడకన సాగుతుండడంతో వివేకా కుమార్తె సునీత అభ్యర్థన మేరకు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఈ కేసును సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దీంతో సీబీఐ అధికారులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే కడప ఎంపీ వై.ఎస్ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారించారు.
తాజాగా ఐదుగురు నిందితులను సీబీఐ విచారించనుంది. ఈ మేరకు వీరిని శుక్రవారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఐదుగురు నిందితులను హైదరాబాద్ తరలించారు. శుక్రవారం సీబీఐ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. విచారణ అనంతరం నిందితులను హైదరాబాద్‌లోనే ఉంచి తదుపరి విచారణ జరుపుతారా?, లేక కడప సెంట్రల్ జైలుకు తరలిస్తారా అనేది చూడాల్సి ఉంది.
Also Read..