- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం సీసాలతో దొరికిన వ్యక్తి.. అండగా నిలిచిన ఎమ్మెల్యే
దిశ, వెబ్ డెస్క్: ప్రొద్దుటూరు సెబ్ అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 మద్యం సీసాలు తీసుకెళ్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రాచమల్లు సెబ్ కార్యాలాయానికి వెళ్లారు. ఎస్‌ఐ అలీ బేగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ వ్యక్తిని తన వెంట తీసుకెళ్లారు.
దీంతో ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం సీసాలతో దొరికిన వ్యక్తికి, ఆయనకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులపై ఎమ్మెల్యే అధికారం చెలాయిస్తున్నారని మండిపడుతున్నారు. అక్రమంగా మద్యం తరలించిన వ్యక్తిని పట్టించాల్సింది పోయి ఇలా మద్దతు పలకడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. పోలీసులకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.