Tragedy: విషాదం నింపిన ఆదివారం.. ప్రమాదవ‌శాత్తు యువకుల మృతి

by srinivas |
Tragedy: విషాదం నింపిన ఆదివారం.. ప్రమాదవ‌శాత్తు యువకుల మృతి
X

దిశ,కడప: వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. స్థానిక హనుమాన్ నగర్‌కు చెందిన ఇరువురు యువకులు పెన్నానదిలో చేపలు పట్టేందుకు వెళ్లి మృతి చెందారు. పి. సుధాకర్ (20), ఎద్దుల వెంకట జయకుమార్ (20) ప్రొద్దుటూరు థర్మల్ పవర్ ప్రాజెక్టు రోడ్డులోని పెన్నానదిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రమాదవ శాత్తూ నదిలో పడి గల్లంతు అయ్యారు. ఈ విషయాన్ని గమనించిన తోటి స్నేహితులు ఫైర్, రెవిన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు పెన్నానదిలో గాలించి వీరి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ప్రొద్దుటూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story