- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం.. అడ్డొస్తే అడ్రస్‌లు ఉండవని స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: తన దారికి అడ్డొస్తే వైసీపీ వాళ్ల అడ్రస్‌లుండవని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. కడప జిల్లా చెన్నూరులో యువగళం పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన సీఎం జగన్, వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ప్రజా గర్జన చూసి సీఎం జగన్‌కు నిద్రపట్టడం లేదని విమర్శించారు. సైక్ బ్యాక్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చేది తానేనని చెప్పారు. రెచ్చిపోతున్న వైసీపీ నేతలను వదిలిపెట్టేది లేదని నారా లోకేశ్ హెచ్చరించారు.
ఇక ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి అరెస్ట్‌ను ఖండించారు. వైసీపీ సర్కారు సైకోయిజానికి పరాకాష్ట బాలవీరాంజనేయస్వామి అరెస్టు అని మండిపడ్డారు. శాంతస్వభావి, దళిత మేధావి అయిన డాక్టర్ స్వామి జగన్ సర్కారు అవినీతిని ప్రశ్నిస్తున్నారనే పదేపదే టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి, విపక్ష దళిత ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించడం అంటే ముమ్మాటికీ కక్ష సాధింపేననని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.