Nara Lokesh: ప్రభాకర్ అరెస్ట్‌పై ఆగ్రహం..తక్షణమే విడుదల చేయాలని డిమాండ్

by srinivas |
Nara Lokesh
X

దిశ, వెబ్ డెస్క్: పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను ప్రశ్నార్థకం చేసిన పాపాల పాల‌కుడు జ‌గ‌న్ రెడ్డి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కడప జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. గుంటూరులో టీడీపీ నేత కరణం ప్రభాకర్ అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత‌గ‌ల పౌరుడిగా ప్రభాక‌ర్ ప్రశ్నించ‌డం ఏ సెక్షన్ ప్రకారం నేర‌మో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. త‌ప్పుడు కేసుల్లో అరెస్టులు చేయించి జగన్‌రెడ్డికి అలుపొస్తుందేమో కానీ, తెలుగుదేశం పార్టీ కేడ‌ర్‌కి కాదని హెచ్చరించారు. విధ్వంస‌క ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మ‌రింత ఊపొస్తుందని తెలిపారు. క‌ర‌ణం ప్రభాక‌ర్‌ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తమ వైపు న్యాయం ఉందని, ప్రజాస్వామ్యం ఇచ్చిన హ‌క్కుని లాక్కోలేరని, ప్రభాక‌ర్‌ని త‌క్షణ‌మే విడుద‌ల చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story