Kadapa: ఏపీ ప్రత్యేక హోదా కోసం సహకరిస్తాం: Bhatti Vikramarka

by srinivas |   ( Updated:2023-08-31 13:45:22.0  )
Kadapa: ఏపీ ప్రత్యేక హోదా కోసం సహకరిస్తాం: Bhatti Vikramarka
X

దిశ, కడప: దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం తథ్యమని తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. తెలంగాణలో ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతంకావడంతో ప్రత్యేక బస్సులో ఆయన తిరుమలకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత సీఎం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధించేందుకు తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed