పింఛన్ల పంపిణీలో వసూళ్లు.. సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్

by Jakkula Mamatha |
పింఛన్ల పంపిణీలో వసూళ్లు.. సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్
X

దిశ, కడప: పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారుల నుంచి వసూళ్లు చేస్తున్న తీరుపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఒక్కొక్క లబ్దిదారుడి నుంచి రూ.300 లు ,రూ.500లు వసూలు చేస్తున్న సమాచారం ఆయన దృష్టికి వచ్చింది. ఇలా అక్రమాలకు పాల్పడిన జమ్మలమడుగు నగర పంచాయతీ వార్డు మహిళా సంరక్షణ సచివాలయ ఉద్యోగిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రామి రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్ లో పెన్షన్ తీసేస్తారంటూ లబ్దిదారులను భయపెడుతూ ఒక్కొక్క లబ్దిదారుడి నుంచి రూ.300 లు , రూ.500 లు వసూలు చేస్తున్నట్లు జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు అందడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story