Kadapa: వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, భార్య షబానాపై పోలీస్ కేసు

by srinivas |   ( Updated:2023-06-21 16:57:57.0  )
Kadapa: వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, భార్య షబానాపై పోలీస్ కేసు
X

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి, ఆయన భార్య షబానాపై కడప జిల్లా పులివెందులలో కేసు నమోదు అయింది. మైనర్ బాలుడిని దస్తగిరి, షబానా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో పోలీసులకు మైనర్ బాలుడి తల్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దస్తగిరి, ఆయన భార్య షబానాపై కిడ్నాప్, దాడి, బలవంతంగా నిర్బంధంపై కేసు నమోదు చేశారు.

కాగా పులివెందుల జయమ్మ కాలనీలో నివాసముంటున్న కుళ్లాయమ్మ దంపతులకు గతంలో దస్తగిరి రూ.40 వేలు అప్పు ఇచ్చారు. ఇందుకు ఇంటిపత్రాన్ని పూచీకత్తుగా పెట్టారు. ప్రతివారం వడ్డీ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే రెండు వారాలుగా కుళ్లాయమ్మ దంపతులు వడ్డీ చెల్లించడంలేదు. దీంతో కుళ్లాయమ్మ కుమారుడు వల్లీని దస్తగిరి తన ఇంట్లో నిర్బంధించారు. ఈ మేరకు కుళ్లాయమ్మ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచరణ చేపట్టి దస్తగిరి ఇంట్లో ఉన్న బాలుడిని విడిపించారు. వైద్య పరీక్షల అనంతరం కుళ్లాయమ్మ దంపతులకు బాలుడిని అప్పగించారు. తాజాగా దస్తగిరితో పాటు ఆయన భార్యపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story