అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్.. భారీగా బంగారం, వెండి స్వాధీనం

by srinivas |   ( Updated:2024-01-14 13:28:45.0  )
అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్.. భారీగా బంగారం, వెండి స్వాధీనం
X

దిశ, కడప: అన్నమయ్య జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.33 లక్షలు విలువైన బంగారు, వెండి ఆభరణాలనూ, కారును స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి మదనపల్లె రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ముగ్గరు వ్యక్తులు కారులో వస్తూ పోలీసులను చూసి పారి పోయేందుకు యత్నించారు. దీంతో వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణ తర్వాత అరెస్ట చేశారు. నిందితులు కర్నాటక రాష్ర్టం చిక్ బల్లాపూర్‌కు చెందిన కృష్ణప్ప రాజేష్ (21), చిత్తూరు జిల్లాకు చెందిన తలారి హేమాద్రి (47), మదనపల్లె‌కు చెందిన ఆవుల ప్రసాద్ (38)గా గుర్తించారు. వీరిపై 15 దొంగతనాల కేసులున్నాయని తెలిపారు. రాయచోటి, రైల్వేకోడూరు, చిన్నమండెం, మదనపల్లె, చిట్వేలి, సంబేపల్లె పోలీసు స్టేషన్‌లలో వీరిపై 15 చోరీ కేసులున్నాయని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed