Kadapa: కాలువలో పడి తల్లీకూతురు మృతి

by srinivas |
Kadapa: కాలువలో పడి తల్లీకూతురు మృతి
X

దిశ, కడప: నీటి కాలువలో పడి తల్లి, కూతురు మృతి చెందారు. ఈ ఘటన వైయస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం గురిజాలలో జరిగింది. గ్రామానికి చెందిన తల్లి కూతురు కాలవలోకి బట్టలు ఉతికేందుకు వెళ్లారు. ఈ సమయంలో తల్లి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయి నీటిలో గల్లంతయ్యారు. తల్లిని రక్షించేందుకు కుమర్తె నీటిలో దిగారు. దీంతో ప్రమాదవశాత్తు ఇద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టంకు తరలించారు. కూతురు మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లీకూతుళ్ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Next Story