- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: ప్రొద్దుటూరులో పోటీ చేయ్...పవన్‌కు ఎమ్మెల్యే రాచమల్లు సవాల్
దిశ, కడప: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజంగా స్టార్ అయితే ప్రొద్దుటూరులో పోటీ చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. ఈసారి అసెంబ్లీకి కచ్చితంగా వెళ్తానని.. ఎవరాపుతారో చూస్తానన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి పవన్ కల్యాణ్ ఎలా వెళ్తారో చూస్తానని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ ఎవరిని మోసం చేయడానికి రెండు నాలుకల ధోరణిలో మాట్లాడుతున్నారన్నారు. కేవలం ముప్పై స్థానాల్లో పోటీ చేసే జనసేనాని సీఎం అభ్యర్థి ఎలా అవుతాడని రాచమల్లు ప్రశ్నించారు. జనసైనికులను, కాపులను పవన్ కల్యాణ్ మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ నాయకులను చెప్పుతో కొడతానని పవన్ మాట్లాడటం వల్ల ప్రజలకు ఏమి లాభమని రాచమల్లు నిలదీశారు. జగన్మోహన్ రెడ్డిపై తలపడే శక్తి సామర్ధ్యాలు పవన్ కల్యాణ్‌కు లేవన్నారు. పవన్ కల్యాణ్ ఈసారి ఎమ్మెల్యే అవుతానని.. ఎవరు ఆపుతారో ఆపండని అంటున్నారని, కాని సీఎంను అవుతా ఎవరు ఆపుతారో ఆపండని మాత్రం అనడం లేదని ఎమ్మెల్యే రాచమల్లు ఎద్దేవా చేశారు.