- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వై.వి.యు యూనివర్సిటీ లో ఫుడ్ పాయిజన్..17 మంది విద్యార్థులు అస్వస్థత
దిశ, ప్రతినిధి: యోగివేమన విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి వై.వి.యు వసతి గృహంలో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకొని అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు.కలుషిత ఆహారం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారనీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు రాత్రి 7:30 నుంచి 9:30 వరకు వరకు భోజనం చేస్తారు. రాత్రి భోజనంలో అన్నం, వంకాయ కూర, రసం, పెరుగు విద్యార్థులకు వడ్డించారు. ఎప్పటి లాగే బుధవారం రాత్రి భోజనం చేసే విద్యార్థులు రాత్రి 10:30 గంటలకు ప్రాంతంలో అస్వస్థతకు గురయ్యారు. 11 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వెంటనే తోటి విద్యార్థులు, సిబ్బంది వై వి యూ అంబులెన్స్ లో రిమ్స్ కు తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించారు.
విద్యార్థులతో పాటు రిమ్స్ కు వైస్ ఛాన్స్లర్ ఆచార్యా చింతా సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి రిమ్స్ కు చేరుకొని రాత్రంతా విద్యార్థుల దగ్గర ఉండిపోయారు. విద్యార్థులు కోలుకోవడంతో గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో డిశ్చార్జ్ చేశారు. ఈలోగా వై వి యూ వసతి గృహంలో ఎనిమిది గంటల ప్రాంతంలో మరో ఆరుగురు విద్యార్థులు వాంతులు, విరేచనాల కు గురయ్యారు. వారిని కూడా తరలించి చికిత్స అందించారు. విద్యార్థులు సమాచారాన్ని వైవియూ అధికారులు తల్లిదండ్రుల కు సమాచారం చేరవేశారు. విద్యార్థులు కలుషిత ఆహారం తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారని విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు.
విద్యార్థులకు నాసిరకంగా భోజనం వడ్డిస్తున్నారని గతంలో పలుమార్లు విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన వై.వి.యు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వారానికి ఒకసారి వై వి యు ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి హాస్టల్ తనిఖీ చేసి హాస్టల్ తో తనిఖీ చేస్తున్నా ప్రయోజనం లేక పోతోందని పేర్కొన్నారు. హాస్టల్ నిర్వాహకులు నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన లు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. వారి పై పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.
Read More..