- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Atrocious: బద్వేలు లో దారుణం.. కలకలం రేపిన అన్నదమ్ముల హత్య
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే ఇద్దరు యువకులు హత్యకు గురికావడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాలలోకి వెళ్తే.. బద్వేలు పట్టణం గాంధీనగర్ లో పసుపులేటి వెంకటసుబ్బయ్య, లక్ష్మీదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రశాంత్ (26), సాయికుమార్ (25) అనే ఇద్దరు కుమారులు. అన్నదమ్ములు ఇద్దరు బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే నూత సంవత్సర వేడుకల్లో భాగంగా 2023 డిసెంబర్ 31 వతేదీన తాగి, మద్యం మత్తులో ఉన్న అన్నదమ్ములు సుమిత్రానగర్‌కు చెందిన లకిడి విజయకుమార్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని విజయకుమార్ తన కుమారులు ప్రమోద్‌కుమార్, తరుణ్‌తేజ్‌కు తెలిపారు.
తన తండ్రితో ఎందుకు గొడవ పడుతున్నారని.. ఇలా మరోసారి జరిగితే ఉపేక్షించమని విజయ్ కుమార్ కుమారులు ప్రశాంత్ , సాయికుమార్ ను హెచ్చరించారు.అయితే బుధవారం రాత్రి మార్కెటా్ యార్డ్ వద్ద ప్రమోద్ ను చూసిన ప్రశాంత్, సాయి మద్యం మత్తులో అతనితో గొడవపడి దాడి చేసారు. వెంటనే ప్రమోద్ తన తండ్రికి, సోదరుడికి విషయం తెలిపారు. అనంతరం గురువారం ఉదయం ఎరికలవీధిలో ప్రశాంత్, సాయి ఉండడం గమనించిన ప్రమోద్ తండ్రి విజయ్ కుమార్ అతని అన్న ప్రమోద్ ని ఎందుకు కొట్టారని వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్, సాయి ఆగ్రహంతో వారి దగ్గర ఉన్న పిడిబాకుతో విజయ్ కుమార్ అతని కుమారుడి పై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో విజయ కుమార్, అతని కుమారుడు ఆ అన్నదమ్ముల పైన రాళ్లతో దాడి చేసారు. అంతటితో ఆగకుండా ప్రశాంత్, సాయి వద్ద వున్న పిడిబాకును లాక్కొని వారిని పొడిచారు. ఈ ఘటనలో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా, సాయి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సాయిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటన స్థలానికి చేరుకున్న బద్వేలు సి.ఐ యుగంధర్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలానే మృతదేహాన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.