AR Rahman visited Amin Peer Dargah in Kadapa District

by srinivas |   ( Updated:2022-12-08 15:04:17.0  )
AR Rahman visited Amin Peer Dargah in Kadapa District
X

దిశ, డైనమిక్ బ్యూరో : సినీ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇకపోతే 'అమీన్ పీర్ దర్గా' ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర గంధం మహోత్సవాన్ని దర్గా ప్రతినిధులు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో దర్గా పీఠాధిపతి అరిఫులా హుస్సాని ఇంటి నుంచి గంధాన్ని తీసుకుని వచ్చి దర్గాలో మాజర్ల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


ఈ గంధం వేడుకల్లో సంగీత మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ పాల్గొన్నారు. గంధమహోత్సవంలో పాల్గొన్న రెహ్మాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. గత కొన్నాళ్లుగా ఏఆర్ రెహ్మాన్ అమీన్ పీర్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story