Kadapa: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

by srinivas |
Kadapa: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ, కడప: వైయస్సార్ జిల్లా రాజుపాలెం మండలం పగిడాలలో ట్రాక్టర్‌ను మోటర్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటర్ సైకిల్‌తో వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వెల్లాల గ్రామానికి చెందిన ఇండ్ల ఓబులేసు (35 ), దండు వీరయ్య (39 )గా గుర్తించారు. వీరిద్దరూ రాజుపాలెం వైపు నుంచి మోటార్ సైకిల్‌పై వస్తూ చాగలమర్రి బైపాస్ రోడ్డు మూలమలుపు వద్ద ట్రాక్టర్‌‌ను ఢీకొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓబులేసు, వీరయ్య మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story