- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చీరాలలో వైసీపీకి బిగ్ షాక్.. ఆమంచి కృష్ణమోహన్ గుడ్ బై
దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమంచి భావించారు. అయితే ఈ టికెట్ కరణం వెంకటేశ్‌కు ఇవ్వడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చీరాల వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కరణం బలరాం వైసీపీలో చేరారు. దీంతో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ మేరకు ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు ఇంచార్జిగా నియమించారు.
Read More..
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఆ నియోజకవర్గ MLA అభ్యర్థి మార్పు
అయితే ఇటీవల పర్చూరు అభ్యర్తిగా యెడం బాలాజీని నియమించారు. దీంతో వరుస ఎదురుదెబ్బలు తగలడంతో వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్ లో చేరతారని.. ఆ పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆమంచి వర్గీయులు అంటున్నారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య శిష్యుడిగా రాజకీయాల్లో వచ్చిన ఆమంచి రెండు సార్లు చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి టికెట్ దక్కకపోవడంతో చీరాల వెనక్కి తగ్గేది లేదంటున్నారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా చీరాల బరిలో ఉంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.