ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్... టీడీపీలో చేరిన 17 మంది కార్పొరేటర్లు

by srinivas |   ( Updated:2024-08-14 09:35:00.0  )
ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్... టీడీపీలో చేరిన 17 మంది కార్పొరేటర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టికి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ సహా 17 మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లను జనార్దన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది.

కాగా సార్వత్రిక ఎన్నికలకు మునుపు జరిగిన ఒంగోలు మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసింది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో పాటు ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘోరంగా ఓడిపోయారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీ బలం తక్కువగా ఉంది. దీంతో వైసీపీ కార్పొరేటర్లను ఆకర్షించారు. ఈ మేరకు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement

Next Story