Breaking: వైసీపీకి బిగ్ షాక్... పిటిషన్ కొట్టివేత

by srinivas |   ( Updated:2024-06-01 16:11:38.0  )
Breaking: వైసీపీకి బిగ్ షాక్... పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్వో సీల్ లేకున్నా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను రద్దు చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్వో సీలు లేకున్నా ఓటును అనుమతించాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో వైసీపీ నేతలు చేసిన హడావుడికి హైకోర్టు తీర్పు చెక్ పెట్టినట్లైంది.

Advertisement

Next Story