AP News:రజనీతో రాయబారం..బాలినేనికి వైసీపీ బుజ్జగింపులు!

by Jakkula Mamatha |   ( Updated:2024-09-13 10:47:26.0  )
AP News:రజనీతో రాయబారం..బాలినేనికి వైసీపీ బుజ్జగింపులు!
X

దిశ, డైనమిక్​ బ్యూరో:మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడుతున్నారనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు బుజ్జగింపులు మొదలయ్యాయి. ఆయనతో మాజీ మంత్రి విడదల రజిని భేటీ అయ్యారు. బాలినేని పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్​లోని బాలినేని ఇంటికి పార్టీ ముఖ్య నేతలు వెళ్లారు. పార్టీ వీడొద్దంటూ వారు కోరారు. మరోవైపు ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో బాలినేని భేటీ అయ్యారు. ఈ భేటీలో 20 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. పార్టీ వీడే అంశంపై ఆయన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఒంగోలు నుంచి కార్పొరేటర్లను హైదరాబాద్​కు రప్పించడం పై కూడా చర్చనీయాంశమైంది. నిరూపణ చేసేందుకు ఆయన వారిని పిలిపించారని చెబుతున్నారు. అయితే ఆయనను బుజ్జగించేందుకు రజిని పంపారని భావిస్తున్నారు. గత బుధవారం తాడేపల్లిలో జగన్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశమైనట్లు సమాచారం. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలంటూ బాలినేనిని వైఎస్ జగన్ కోరగా.. అందుకు ఆయన తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన జనసేన, లేదా బీజేపీలో చేరతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో బాలినేనితో రజిని భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more: వైసీపీకి మరో బిగ్ షాక్‌.. పార్టీకి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి గుడ్‌బై!

Advertisement

Next Story