- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిన్న హల్దీ ఫంక్షన్.. నేడు క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి! రాజస్థాన్‌లో వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి ముఖ్యమైన సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక ముగిసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శనివారం వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియాల హల్దీ ఫంక్షన్ ఫోటోలను వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. మరోవైపు ఇవాళ క్రిస్టియన్ పద్ధతి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ ఫోటోలను కూడా తాను ఇవాళ షేర్ చేశారు. అయితే ఈ వివాహంపై నెట్టింట చర్చ జరుగుతుంది. హల్దీ ఫంక్షన్ అనేది హిందూ సంప్రదాయ పద్ధతి అని, పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేయించారని నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
అయితే వైఎస్ జగన్ తన మేనల్లుడి పెళ్లికి దూరంగా ఉన్నారు. ఇటీవల ఆయన హైదరబాద్‌లో జరిగిన నిశ్చితార్ధం వేడుకల్లో మాత్రమే పాల్గొన్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటం, అభ్యర్థుల ఎంపిక విషయం ఉండటంతో సీఎం జగన్ ఈ వివాహానికి హాజరు కాలేకపోయారని వైసీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.