BIG BREAKING:సీఎం చంద్రబాబు పాలనపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-12 09:19:44.0  )
BIG BREAKING:సీఎం చంద్రబాబు పాలనపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..?
X

దిశ,వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నెల రోజుల పరిపాలనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అండ్ కూటమి..నెలరోజుల పాలన గడిచింది. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 లో మహిళలకు ఫ్రీ బస్సు వాగ్దానం పై ఉలుకూ పలుకూ లేదు. ఉచిత బస్సు ప్రయాణం పై ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నెలలోపు..కర్ణాటకలో మూడో వారంలోపే ఈ పథకాన్ని అమలు చేసిందని షర్మిల తెలిపారు. నెల రోజులు గడిచింది అయినా ఇప్పటి వరకు ఉచిత ప్రయాణం పై వాగ్ధానం నిలబెట్టుకోలేదని అన్నారు.

చంద్రబాబుకి ఎందుకు ఇంత సమయం పడుతుందో సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల కోరారు.ఇందులో విధివిధానాలు ఏముంటాయి? ‘చిత్తశుద్ధి ఉంటే చాలు’ అని తెలిపారు. ఈ క్రమంలో సూపర్ సిక్స్ లో ఒక సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్ లో మిగతా పథకాలు వెంటనే అమలు చేయాలని తెలిపారు. ‘అమ్మకి వందనం’ అనే పథకంలో క్లారిటీ లేదు ఎంత మంది బిడ్డలు ఉంటే అన్ని 15 వేలు ఇస్తాం అన్నారు. అమ్మకు వందనం పథకం పై ఇచ్చిన GO పై క్లారిటీ లేదు. అమ్మకి ఇస్తారా ? బిడ్డకు ఇస్తారా ? ఇచ్చిన ఉత్తర్వుల్లో అమ్మకి 15 వేలు అని ఉంది అమ్మకి వందనం పథకం పై క్లారిటీ ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు.

ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15 వేలు ఇవ్వాల్సిందే అని పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలు చంద్రబాబు సీఎం అవ్వాలా? వద్దా అనే కోణంలో జరిగాయని..చంద్రబాబు సీఎం కావాలని అనుకున్న వాళ్ళు కూటమికి వేశారు..సీఎం వద్దు అనుకున్న వాళ్ళు జగన్‌కి వేశారు. అంతేగానీ జగన్ మీద ప్రేమ ఉండి కాదు అని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద మనసుతో వచ్చినందుకు తెలంగాణ సీఎం రేవంత్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకి అనుభవం ఉంది. రాష్ట్రాన్ని నడపలేం అని చెప్పడం కరెక్ట్ కాదు అన్నారు. సమర్ధుడు అని ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి కేంద్రం వద్ద రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడి..ప్రత్యేక హోదా సాధించాలని వైఎస్ షర్మిల తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed