- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics:కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం..వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. ఈ క్రమంలో వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఓ పిల్ల కాలువ అని, అది ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని వ్యాఖ్యనించారు.
ఒకవేళ వారు కలుస్తామని అంటే స్వాగతిస్తామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైసీపీ చీఫ్‌తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమన్నారు. జగన్ తిరిగి అధికారంలోకి రారని షర్మిల జోస్యం చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోమని సెటైర్ వేశారు. ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందన్న ప్రచారాన్ని ఖండించిన షర్మిల..వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించడం పలు సందేహాలకు దారితీస్తుంది. గతంలోనే షర్మిల ఈ కామెంట్స్ చేసిన తాజాగా మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనుక రహస్యం ఏంటి? అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.