- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఏర్పాటైన నూతన ప్రభుత్వం పై..వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణాజిల్లా కేసరపల్లి వద్ద ఉన్న మేథా టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కళ్యాణ్‌తో పాటు మరో 23 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు, పవన్‌తో పాటు మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు తమను ఎంతో కలచివేశాయని షర్మిల పేర్కొన్నారు.