AP RESULTS: పోస్టల్ బ్యాలెట్‌లో వెనకబడ్డ షర్మిల.. అవినాశ్ రెడ్డి ముందంజ

by srinivas |   ( Updated:2024-06-04 03:33:15.0  )
AP RESULTS: పోస్టల్ బ్యాలెట్‌లో వెనకబడ్డ షర్మిల.. అవినాశ్ రెడ్డి ముందంజ
X

దిశ, వెబ్ డెస్క్: పోస్టల్ బ్యాలెట్‌‌లో వైఎస్ షర్మిల వెనకబడ్డారు. తొలి రౌండల్‌లో ముందజలో కొనసాగిన ఆమె.. రెండో రౌండ్‌లో వెనకంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ ఆయనకు 2274 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఎంపీ బరిలో దిగారు. వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి మరోసారి కూడా పోటీ చేశారు. అయితే కడప రాజకీయమంతా వైఎస్ వివేకానందారెడ్డి హత్య వైపు సాగింది. వివేకా కూతురు వైఎస్ సునీత.. వైఎస్ షర్మిలకు మద్దతు పలికారు. వైఎస్ షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలని ప్రజలను ఆమె అభ్యర్థించారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story