YS Sharmila: వాళ్లది అక్రమ సంబంధం.. వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-01-10 07:56:31.0  )
YS Sharmila: వాళ్లది అక్రమ సంబంధం.. వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) వైసీపీ (YCP)పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె విశాఖపట్నం (Vishakhapatnam)లో నిర్వహించిన జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ(BJP)తో టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీలు అక్రమ సంబంధం పెట్టుకుంటే వారితో పాటు వైసీపీ (YCP) కూడా ఆ బంధాన్ని కొనసాగిస్తోందని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా (Special Status) దిక్కు లేదని ఫైర్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్‌ (Vishakha Steel Plant)పై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) కనీస ప్రకటన చేయలేదని ధ్వజమెత్తారు. ఏపీకి తీరని అన్యాయం చేసిన మోడీతో చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pavan Kalyan), జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) దోస్తీ చేయడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ (Congress) అంబేదర్ జపం చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని.. అంబేద్కర్‌ను బీజేపీ అన్ని రకాలుగా అవమానించిందని అన్నారు. అందుకు నిరసనగా ఇవాళ సాయంత్రం మౌన దీక్ష చేస్తున్నానని వైఎస్ షర్మిళ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed