ఎన్నికల వేళ ప్రధాని మోడీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిన YS షర్మిల

by Satheesh |   ( Updated:2024-05-08 14:30:16.0  )
ఎన్నికల వేళ ప్రధాని మోడీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిన YS షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీకి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల వేళ ఊహించని గిఫ్ట్ పంపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల గోడు వినాలని ప్రధానికి ఆమె రేడియో బహుమతిగా పంపించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మాట్లాడే మీరు.. ఈ సారి మా ఏపీ ప్రజల మన్‌కీ బాత్ వినండి అని కోరారు. విజభన హామీలు నేరవేర్చకుండా పదేళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ ఇప్పుడు కపల ప్రేమ చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం ఇన్ని సార్లు రాష్ట్రానికి వచ్చిన మీరు.. అభివృద్ధి పనుల కోసం ఒక్కనాడైనా వచ్చారా అని ప్రశ్నించారు. మీకు ఆంధ్రప్రదేశ్‌లో కాలు పెట్టే అర్హత లేదని, రాష్ట్ర ప్రజలకు ముందుగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీపై ఏపీ ప్రజల తరుపున చార్జ్ షీట్ విడుదల చేస్తున్నామని మీకు దమ్ముంటే ఏపీ ప్రజలకు ఇప్పుడైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వండని సవాల్ విసిరారు. పదేళ్లలో మోడీ చేసిన మోసాలకు 10 ప్రశ్నలు సంధిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Read More...

BREAKING: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది: రాజంపేటలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story