- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ మతతత్వ పార్టీ.. 10 ఏళ్లుగా అరాచకాలు: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ మత తత్వ పార్టీ అని, 10 ఏళ్లుగా అరాచకాలు చూస్తున్నామని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై విమర్శలు చేశారు. హర్ ఘర్ తిరంగ అని మోడీ ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారని, దేశ భక్తి ఉన్నట్లు బీజేపీ సర్టిఫై చేస్తుందట అని సెటైర్లు వేశారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అన చెప్పారు. ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని, జాతీయ జెండాన్ని బీజేపీ, RSS అవమించిందని మండిపడ్డారు. మూడు రంగుల జెండాను గౌరవించమని ఆర్ఎస్ఎస్ చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఒకే రంగు ఉండాలి అని చెప్పారు.. హిందువులు గౌరవించరు అని చెప్పారు. 2001 వరకు RSS పార్టీ ఆఫిస్‌లో జాతీయ జెండాను ఎగరవేయలేదు. నిజానికి ఈ దేశానికి మోడీ చేసింది ఏమీ లేదు. హర్ ఘర్‌ను మోడీ మోసం చేశారు. ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అని మోసం చేశారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేశారు. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం అని మోసం. ఆంధ్రలో హర్ ఘర్ దోకా చేశారు. మణిపూర్‌లో ఊచ కోత కోశారు. ఆంధ్రలో కూడా ప్రతి ఘర్‌ను మోసం చేశాడు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశాడు. విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇవ్వాళ ఆంధ్రలో ప్రతి ఇంటిని మోసం చేశారు. ఇవ్వాళ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది. రాజ్యాంగాన్ని మారుస్తాం అని అంటున్నారు. ఇవ్వాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనుకుంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి. మన రాజ్యాంగం కాపాడాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి. ఈ దేశంలో ఐక్యత మళ్ళీ రావాలి అంటే...ప్రగతికి పునాదులు పడాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి. కాంగ్రెస్ రాకుంటే ఈ దేశం ఇబ్బందులు పడుతుంది. రాహుల్ జగన్ కలుస్తారు అనే విషయం అవాస్తవం’ అని షర్మిల పేర్కొన్నారు.