- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు.. వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ, జనసేన చేరాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన 30 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు పోలీ చేయనున్నాయి. మిగిలిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. అయితే ఈ పొత్తులపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. గతంలో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ దొంగలేనని ఆమె ఆరోపించారు. అసలు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ఐదేళ్లు పొత్తు పెట్టుకున్నారని, ఏపీకి ఏం ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు. అప్పుడు ఏం సాధించారనేది కూడా ప్రజలకు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
Read More..
పొత్తు కుదిరిన వేళ కీలక పరిణామం.. ఏపీకి ప్రధాని... ఆ సభకు వస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు