కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల, ఎమ్మెల్యే ఆర్కే.. ఢిల్లీకి పయనం

by srinivas |   ( Updated:2024-01-03 13:27:23.0  )
కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల, ఎమ్మెల్యే ఆర్కే.. ఢిల్లీకి పయనం
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు వారిద్దరు ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీలో గురువారం ఉదయం కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. చర్చల అనంతరం షర్మిల, ఆర్కే హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు. అలాగే వైఎస్సార్టీపీని వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. వెంటనే ఆమెకు ఏపీ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమిస్తారని, తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున చేరికలుంటాయని అంచనా వేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో భారీగా నేతలు, కార్యకర్తలు చేరతారని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story