- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: టీడీపీ నేతలకు వైఎస్ షర్మిల మాస్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పలు చోట్ల మాజీ సీఎం, దివంగత నేత వైఎస్సార్ విగ్రహాల ధ్వంసం కొనసాగుతున్నాయి. గతంలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను కొందరు ధ్వంసం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని వైసీపీ కాదన్నారు. వైసీపీకి రాజశేఖర్ రెడ్డికి సంబంధం లేదని చెప్పారు. వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు, కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తే అక్కడే బైఠాయించి ధర్నా చేపడతామని హెచ్చరించారు. నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. తమకు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇదే హత్య, కక్ష, గుండా రాజకీయాలు వైసీపీ చేసిందని అందుకే ప్రజలు ఘోరంగా ఓడించారని తెలిపారు. మళ్లీ అదే పరిస్థితి రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకోవాలని వైఎస్ షర్మిల సూచించారు.