ఇటు షర్మిల.. అటు అవినాశ్.. కడపలో ఫ్యామిలీ ఫైట్ షురూ..!

by srinivas |   ( Updated:2024-04-05 15:03:41.0  )
ఇటు షర్మిల.. అటు అవినాశ్.. కడపలో ఫ్యామిలీ ఫైట్ షురూ..!
X

దిశ, వెబ్ డెస్క్: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లీ అవినాశ్ రెడ్డినే బరిలో దిగుతున్నారు. దీంతో కడప పార్లమెంట్ నియోజకవర్గం గెలుపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటు వైఎస్ షర్మిల. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్.. అటు అవినాశ్ రెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యుడు. ఇద్దరి కూడా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటు వైఎస్ జగన్ కూడా కడపలో మరో సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైఎస్సార్ కడప జిల్లా కాశినాయన నుంచి ఆమె బస్సు యాత్ర నిర్వహించారు.

అయితే షర్మిల ప్రచారంలో ప్రధాన ఎజెండాగా వైఎస్ వివేకానందారెడ్డి హత్య మారింది. ప్రత్యర్థి అవినాశ్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు అవినాశ్ రెడ్డిని సోదరుడు వైఎస్ జగన్ కాపాడుతున్నారంటూ ఆమె ప్రచారం చేస్తున్నారు. ఓవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మరోవైపు వివేకను చంపించిన నిందితుడు అని ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారో ప్రజలే తేల్చుకోవాలని వైఎస్ షర్మిల అంటున్నారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి తనను పోటీ చేయించాలని వైఎస్ వివేకానందారెడ్డి కోరుకున్నారని తెలిపారు. ఏపీలో అభివృద్ధి జరగాలన్నా, హత్యా రాజకీయాలకు తెర పడాలన్నా ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలని వైఎస్ షర్మిల పిలుపు నిచ్చారు.

Read More..

Ap Politics:అతను నెంబర్ వన్ క్రిమినల్.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story