- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పేరు పెట్టిన Y. S. Sharmila
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పేషెంట్లతో ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విష జ్వరాలు వణికిస్తున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం పనికిరాదని హితవు పలికారు.
విష జ్వరాలతో ఆంధ్రప్రదేశ్ కాస్త.. జ్వరాంధ్రప్రదేశ్‌గా మారిందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న దుస్థితి కనిపిస్తోందని అన్నారు. ఈ ఐదేళ్లు గత సర్కారును తిడుతూనే కాలయాపన చేస్తారా? లేక ప్రజా సంక్షేమాన్ని పట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. డెంగ్యూ వ్యాధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. పరిస్థితి అందుబాటులో వచ్చే వరకు సీఎం నేరుగా పర్యవేక్షించాలని సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా షర్మిల ట్వీట్ చేశారు.
- Tags
- Y. S. Sharmila