AP:ఓటమి తర్వాత..వైఎస్ జగన్ ముఖంలో తొలిసారి సంతోషం..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-06-23 12:30:24.0  )
AP:ఓటమి తర్వాత..వైఎస్ జగన్ ముఖంలో తొలిసారి సంతోషం..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఎన్నికల ముందు అన్ని స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైంది. ప్రతిపక్ష హోద పొందాలంటే 18 స్థానాలు గెలుచుకోవాలి. కానీ వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో పార్టీకి ప్రతిపక్ష హోద కూడా దక్కలేదు. ఓటమి అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు శనివారం వెళ్లారు.

ఈ సందర్భంగా కడప విమానాశ్రయంలో దిగిన వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ తర్వాత కడప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందులకు వెళ్లిన జగన్‌ను కలిసేందుకు భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం జన సందోహంగా మారిపోయింది. దీంతో జగన్ ముఖం వెలిగిపోయింది. మహిళలు, వృద్ధులు అందరూ వచ్చి జగన్‌కి జేజేలు పలికారు. దీంతో జగన్ సైతం వారి దగ్గరకు వెళ్లి పలకరిస్తూ వారితో మాట్లాడుతూ ఓటమి బాధను మరచిపోయారు. ఇదివరకు మాదిరిగానే ఆయన ముఖంలో నవ్వు కనిపించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.


ఇక్కడ క్లిక్ చేయండి: ఉద్యోగుల పట్ల గత ప్రభుత్వం అమానుషం.. సంచలన విషయాలు బయట పెట్టిన సూర్యనారాయణ

Advertisement

Next Story