YS జగన్ Vs టీడీపీ ట్విట్టర్ వార్..విజయవాడ వరదలపై కౌంటర్ ఎటాక్

by Jakkula Mamatha |
YS జగన్ Vs టీడీపీ ట్విట్టర్ వార్..విజయవాడ వరదలపై కౌంటర్ ఎటాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. భారీ వరదలతో విజయవాడ నగరం అతలాకుతలం అయింది. గతంలో ఎన్నడూ ఎదుర్కొని ప్రకృతి విపత్తును నగర ప్రజలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాయం పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంతోనే విజయవాడలో వరదలు వచ్చాయని ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సాయం అందని పరిస్థితుల్లో ఉండడం దారుణమన్నారు.

జగన్ ట్వీట్‌కు టీడీపీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. తమరు ఈ ట్వీట్ బెంగళూరులో ఉండి వేశారా? లండన్‌లో ఉండి వేశారా? అంటూ కౌంటర్ ఇచ్చింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి మాజీ సీఎం జగన్ కుట్ర చేశారని టీడీపీ ఆరోపించింది. ‘ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు రామ్మోహన్‌కు చెందిన 3 బోట్లను కట్టేసి ఒకేసారి వదిలేశారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలోనే బ్యారేజీని కూల్చేసి విజయవాడను జలసమాధి చేయాలని జగన్ క్రిమినల్ ప్లాన్ వేశాడు. అయితే అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం జరగలేదు. దీనిపై విచారణ జరుగుతోంది’ అని టీడీపీ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story