బీసీల శవాలు..అస్థిపంజరాల మీద వైఎస్ కుటుంబం ఎదిగింది: బుద్ధా వెంకన్న

by Seetharam |
బీసీల శవాలు..అస్థిపంజరాల మీద వైఎస్ కుటుంబం ఎదిగింది: బుద్ధా వెంకన్న
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కుటుంబం బీసీల శవాలు, అస్తిపంజరాల మీద ఎదిగిందని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడారు. బీసీ వ్యక్తి అయిన వెంకట నర్సయ్యను వైఎస్ రాజారెడ్డి మోసం చేశారని ఆరోపించారు. వైఎస్ కుటుంబ సంపాదనంతా వెంకట నర్సయ్యదేనని బుద్ధా వెంకన్న ఆరోపించారు. వెంకట నర్సయ్య మనవళ్లకు జగన్ తన ఆస్తి ఇవ్వాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 30 మంది బీసీలు హత్యలకు గురయ్యారని చెప్పుకొచ్చారు. తన తాత రాజారెడ్డికి బీసీలంటే ఇష్టం లేదని... జగన్‌కు కూడా ఆయన వారసత్వమే వచ్చిందని చెప్పుకొచ్చారు.ఏపీ ఐపీఎస్ క్యాడర్‌లో‌లో బీసీ వర్గానికి చెందిన సీనియర్ అధికారి ద్వారకా తిరుమల రావును పక్కన పెట్టారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. సీనియారిటీలో 16వ స్థానంలో ఉన్న కసిరెడ్డిని డీజీపీని చేశారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. కసిరెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే డీజీపీని చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో బీసీలే కాదు బీసీ ఉద్యోగులు సైతం వేధింపులకు గురవుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు.

Advertisement

Next Story