YS Bhaskar Reddy: ఆయుధం కొన్నది ఆయనే.. బెయిల్ ఇవ్వొద్దు

by srinivas |   ( Updated:2023-03-20 15:02:45.0  )
YS Bhaskar Reddy: ఆయుధం కొన్నది ఆయనే.. బెయిల్ ఇవ్వొద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరియేనని వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్యకేసులో దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్‍రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-4 దస్తగిరిని అప్రూవర్‍గా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు దస్తగిరి స్టేట్‍మెంట్ ఆధారంగానే తమను ఆ నేరంలోకి నెట్టడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్‍మెంట్ ఇస్తున్నాడని పిటిషన్‌లో ఆరోపించారు.


వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని ఆరోపించారు. కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినేనని చెప్పారు. దస్తగిరి బెయిల్ సమయంలోనూ సీబీఐ సహకరించిందని చెప్పారు. దస్తగిరి దగ్గరున్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదన్నారు. దస్తగిరి బెయిల్‍ను రద్దు చేయాలని పిటిషన్‍లో వైఎస్ భాస్కర్ రెడ్డి కోరారు.

Read more:

Viveka Murder Case: సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Advertisement

Next Story