‘వైసీపీని విమర్శించే అర్హత మీకు లేదు’.. మాజీ మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-23 05:51:34.0  )
‘వైసీపీని విమర్శించే అర్హత మీకు లేదు’.. మాజీ మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న లైంగికదాడి(sexual assault), హత్య ఘటనలపై టీడీపీ(TDP), వైసీపీ(YCP) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా హోం మంత్రి అనిత(Home Minister Roja) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీ పార్టీ ఆఫీస్‌కి 10కి.మీ దూరంలోని గుంటూరు ఆస్పత్రిలో నవీన్ హత్యాయత్నం చేసిన దళిత యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించలేవా? బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థి దస్తగిరమ్మ హత్య జరిగి 3 రోజులైంది ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనిపించలేదా? మంత్రిగా బాధ్యతలు మరిచిన మీకు మిమ్మల్ని విమర్శించే అర్హత లేదు.. రాదు’ అని మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వంలో లైంగిక దాడులు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన బద్వేల్ ఘటన పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed