అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వైసీపీ.. అచ్చెన్నాయుడు ఫైర్

by Shiva |
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వైసీపీ.. అచ్చెన్నాయుడు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఇవాళ అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లకు సంబంధించిన అధికారిక డేటా చట్టవిరుద్ధంగా వైసీపీ నేతలకు చేరుతోందని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఓటర్ల వ్యక్తిగత డేటాను వైసీపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా మంత్రి విడదల రజని పేరు మీద గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల ఫోన్ నెంబర్లకు ఎస్ఎంఎస్‌లు కూడా పంపించారంటూ ఆయన ఫిర్యాదులో ఈసీకి తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై వెంటనే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల అధికారులను అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed