- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీ అవుతోన్న వైసీపీ.. ఎన్నికల వేళ అధికార పార్టీకి వరుస షాక్‌లు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీ అవుతోన్న వైసీపీ.. ఎన్నికల వేళ అధికార పార్టీకి వరుస షాక్‌లు
X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇటీవలే జిల్లాలోని వైసీపీ కీలక నేతలంతా టీడీపీలో చేరడంతో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారింది. ఇప్పటికే సీఎం జగన్ తీరు నచ్చక ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి మరొకొందరు నాయకులు రాజీనామాకు సిద్ధమయ్యారు. రూరల్ కోడూరులో వైసీపీ ముఖ్య నేత కమలాకర్ రెడ్డి వైసీపీ రాజీనామా చేశారు. అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, మరికొందరు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఇక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా సైకిల్ ఎక్కనున్నారు. అయితే, ఈ నెల 2న జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉండటంతో ఆయన సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.
Advertisement
Next Story