Cm Jagan సవాల్‌ను స్వీకరించగలవా?.. ప్రతిపక్షాలకు విజయసాయిరెడ్డి ప్రశ్న

by srinivas |   ( Updated:2023-03-01 16:12:53.0  )
Cm Jagan సవాల్‌ను స్వీకరించగలవా?.. ప్రతిపక్షాలకు విజయసాయిరెడ్డి ప్రశ్న
X

దిశ, నెల్లూరు: విశాఖలో ఈ నెల 3,4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో అడుగడుగునా రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. బ్యాడ్జీలు దగ్గర నుంచి కిట్లు వరకు రాష్ట్ర సంస్కృతి దర్శనమిచ్చేలా డిజైన్ చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచిందని ఆయన తెలిపారు.

అతిధులకు ఇచ్చే గిఫ్ట్ బాక్స్‌లపై పెడన కలంకారీ డిజైన్, ముఖ్య అతిథులకు సిల్వర్ ఫలిగ్రీతో చేసిన జీఐఎస్ లోగో‌తో ఉన్న బహుమతులు అందించనున్నారని అన్నారు. రానున్నవి పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలని విజయసాయి రెడ్డి అభివర్ణించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించి ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యముందా అని సీఎం జగన్ విసిరిన ఛాలెంజ్ ప్రతిపక్షాలు స్వీకరించగలవా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story