- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking:టీడీపీలోకి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం దంపతులు..!
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీ సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం, ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన ఆ పార్టీ నేతలు కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల పలువురు వైసీపీ కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి ఆయన సతీమణి, జెడ్పీ ఛైర్‌పర్సన్ అరుణమ్మ టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రి నారాయణ నివాసానికి వీరు వెళ్లడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేపు జరిగే జెడ్పీ సమావేశానికి మంత్రిని ఆహ్వానించేందుకు వారు ఆయన నివాసానికి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.