AP:ఆ విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌ను ప్రశ్నించిన వైసీపీ..?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-12 10:33:12.0  )
AP:ఆ విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌ను ప్రశ్నించిన వైసీపీ..?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో జరిగిన ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం ఘటనపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ దారుణమైన ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు పై వైసీపీ ప్రశ్నించింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరును వైసీపీ తప్పుపట్టింది. గత ఆదివారం(జులై 6న) బాలికను దారుణంగా అత్యాచారం చేస్తే ఇంతవరకు మృత దేహాన్ని కనిపెట్టలేకపోయారని వైసీపీ మండిపడింది. పవన్ కళ్యాణ్ మీకు బాధ్యత లేదా? డిప్యూటీ సీఎంగా ఉంటూ జరిగిన ఘటనకు బాధ్యత తీసుకోవాల్సింది పోయి నేనే పేపర్‌లో చదివానని చెప్పడం ఏంటి పవన్? అంటూ..మీకు లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అని వైసీపీ ప్రశ్నించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ బాలికపై అత్యాచారం ఘటన గురించి మాట్లాడిన వీడియో వైసీపీ షేర్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

Advertisement

Next Story