- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
YCP: పవన్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.. మాజీమంత్రి అంబటి కౌంటర్
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడని మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(YCP Leader Ambati Rambabu) అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stampade) ఘటనపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) సపోర్ట్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో తప్పేం లేదని, ఆ సమయంలో నేను ఉన్నా ఆయన అలాగే చేసేవారని అన్నారు. అంతేగాక అల్లు అర్జున్(Allu Arjun) జరిగిన ఘటనపై త్వరగా స్పందించి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదని, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై మాజీమంత్రి అంబటి స్పందిస్తూ.. సెటైరికల్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో.. "సంఘటన జరిగిన 27 రోజుల తరువాత నోరు మెదిపి, మీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం అని పవన్‌కు కౌంటర్ ఇచ్చారు.