AP News: సీఎం చంద్రబాబు పై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News: సీఎం చంద్రబాబు పై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ(YCP) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పై వైసీపీ ఎంపీ(YCP MP) విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, కరువు కవల పిల్లలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని సంబంధం ఉందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. వైసీపీ(YCP) హయాంలో రైతులపై ఆర్థిక భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల భీమా పథకం అమలు చేసిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం(AP Government) నిర్వీర్యం చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ రైతుల ఉసురు తీస్తోంది అని ఆయన ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story