- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Spain Floods: స్పెయిన్‌లో వరదలు.. 72 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో: తూర్పు స్పెయిన్(Spain)లో మెరుపు వరదలు పోటెత్తాయి. స్వల్పకాలంలోనే వీధులు నదులను తలపించగా.. కార్లు వరద నీటి(Flash Floods)లో కొట్టుకుపోయాయి. కనీసం 72 మంది వరదల్లో మరణించారు. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు వరద నీటిలో మునిగిపోయాయి. ఇటీవలి కాలంలో స్పెయిన్‌ను ముంచెత్తిన భీకర వరదలు ఇవే.
మంగళవారం భారీ వర్షం(Heavy Rains) మొదలైంది. తెరపిలేకుండా రాత్రంగా కురవడంతో ఉదయానికల్లా దక్షిణ, తూర్పు స్పెయిన్‌లోని చాలా ప్రాంతాలు.. మలగా నుంచి వాలెన్సియా వరకు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో వాహనాలు బురదతో కప్పుకుపోయాయి. ఇంటిలోని వస్తువులు, కర్రలు, చెక్క పరికరాలు వరద నీటిలో తేలుతూ కనిపించాయి. ఎమర్జెన్సీ రెస్సాన్స్ యూనిట్ నుంచి వేయి మంది సైనికులు సహాయకపనుల్లో మునిగిపోయారు. వాలెన్సియాలో బుధవారం 62 మంది మరణించగా.. పొరుగునే ఉండే కాస్టిల్లా లా మాంచా రీజియన్‌లో మరో ఇద్దరు చనిపోయారు.