- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
protest : నకిలీ విత్తనాల అమ్మకం..మోసపోతున్న రైతులు
దిశ బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం వెలుగొండ గ్రామానికి చెందిన రైతులు నిరసనకు దిగారు. మండల కేంద్రానికి చెందిన శ్రీ సాయి ట్రేడర్స్, భాగ్యలక్ష్మి ఫర్టిలైజర్ తో పాటు.. నాసిరకం పత్తి విత్తనాలు ఇవ్వడంతో మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చెందారు. బిజినాపల్లి మండల కేంద్రంలో బుధవారం పత్తి విత్తనాలు తీసుకున్న వెలుగొండ గ్రామానికి చెందిన రైతులు దాదాపు 500 ఎకరాలకు పైన తీసుకున్న తడాఖా సీడ్ కంపెనీ పత్తి విత్తనాలు తీసుకున్న రైతులు పత్తి చెట్లు వేపుగా పెరిగి కాయ కాయకపోవడంతో.. డీలర్ల దగ్గరికి వచ్చి పంట నష్టపరిహారం మాకు చెల్లించాలని డీలర్ల షాప్ ల వద్ద ధర్నా నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు డీలర్లతో కుమ్మక్కై ఫర్టిలైజర్స్ దుకాణాల వద్ద నెల మాములకు అలవాటు పడి తనిఖీలు తూ తూ మంత్రంగా తనిఖీలు చేసి రైతులను ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ దుకాణాలు నిబంధనలు తుంగలో తొక్కి నిషేధిత పురుగుమందులు విత్తనాలు జోరుగా విక్రయిస్తున్నారు. అయినా మండలస్థాయి అధికారులకు తెలిసిన చూసి చూడనట్లు నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుతున్నారు . వ్యవసాయ అధికారులు జూన్ మాసంలో నామమాత్రపు తనిఖీలు చేసి రైతులను మంచుతున్నారని ఆ గ్రామ ప్రజలు ఆరోపించారు. తడాఖా సీడ్ కవర్లు మావే అని తడాఖా సీడ్ కంపెనీవారు అంటున్నారు. కానీ అందులో ఉన్న విత్తనాలు మావి కావని ఫోన్ ద్వారా విన్నవించారు. విత్తనాలు కల్తీ కంపెనీ నుంచి సరఫరా చేస్తున్న వ్యవసాయ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా షాపులపై తనిఖీలు చేసి విత్తనాలను నాణ్యత ప్రమాణాలు ఉండే విధంగా చూసి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వెలుగొండ రైతులు మండల వ్యవసాయ అధికారి కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో.. వెంటనే స్పందించిన అధికారి వారి పొలం వద్దకు వెళ్లి పత్తి చేను పరిశీలించి..నష్టం జరిగిన రైతులకు తాము అండగా ఉంటామని, కంపెనీ తమకు న్యాయం చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని రైతులకు భరోసా కల్పించారు.