- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘోర విషాదం.. నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని తండ్రి కూతురు మృతి
దిశ, మధిర: రైలు దిగి పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన నవజీవన్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో తండ్రి కూతురు అక్కడికక్కడే మృతి చెందిన ప్రమాద సంఘటన మధిరలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే జిఆర్పి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధిర మండలం మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు (52) తన కూతురు ఖమ్మంపాడు గ్రామానికి చెందిన నూకారపు సరిత (28) తో కలిసి విజయవాడ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తిరిగి మధిరకు చేరుకున్నారు. విజయవాడ నుండి కృష్ణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో మధిరకు వచ్చినట్లు తెలిసింది. వీరు రెండవ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు దిగారు. అనంతరం మల్లారం వెళ్లేందుకు రైల్వే ట్రాక్‌ను దాటి వెళుతున్న క్రమంలో విజయవాడ నుండి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వారిని వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తండ్రీ కూతురు ఇరువురు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా మృతురాలు సరిత కుమారుడు పదేళ్ల బాబు పట్టాలు దాటి ప్రాణాలలో బయటపడినట్లు జి ఆర్ పి పోలీసులు తెలిపారు. విషయాన్ని గుర్తించి తక్షణమే ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిర్వహించి మధిర ప్రభుత్వ ఆసుపత్రికి శవ పంచనామ నిమిత్తం తరలించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి భాస్కర్ రావు తెలిపారు. మృతులు స్థానికులుగా గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని జి ఆర్ పి ఎస్సై తెలిపారు. తండ్రి కూతురు మృతి చెందడంతో అటు మల్లారం ఇటు ఖమ్మంపాడు గ్రామాల్లో వారి కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.