- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: ఎమ్మెల్సీ వంశీకృష్ణ సంచలన నిర్ణయం.. న్యాయ పోరాటం చేస్తానంటూ హెచ్చరిక
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ తిరుగుబాటు ఎగరేశారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఆయన ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తానంటూ హెచ్చరించారు. విశాఖకు చెందిన కార్పొరేటర్ వంశీకృష్ణకు సీఎం జగన్ 2021లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగిన వంశీ కొద్ది రోజుల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. దీంతో వంశీకి వైసీసీ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. మండలి చైర్మన్ ద్వారా అనర్హత నోటీసులు జారీ పంపింది. పార్టీకి గుడ్ బై చెప్పడంపై తమ ఎదుట వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది.
అయితే చైర్మన్ నోటీసులకు వంశీకృష్ణ స్పందించలేదు. అంతేకాదు చైర్మన్ వద్దకు వెళ్లలేదు. దీంతో డైరెక్ట్‌గా చైర్మనే వేటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. మండలి చైర్మన్ ఇచ్చిన నోటీసులపై వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. చైర్మన్ ఇచ్చిన నోటీసులకు తాను అఫిడవిట్ ఇస్తానని చెప్పారు. చైర్మన్ ఎదుట స్వయంగా హాజరవుతానని తెలిపారు. తాను అనర్హత పరిధిలోకి రాననే విషయాన్ని చైర్మన్ ఎదుట హాజరై చెబుతున్నానని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయలేదని, అనర్హత నోటీసులు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. చైర్మన్ ఇచ్చిన నోటీసులపై తాను న్యాయపోరాటం చేస్తానని వంశీ కృష్ణ వెల్లడించారు.