BREAKING: సీఎం జగన్‌కు బిగ్ షాక్.. వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా

by Satheesh |   ( Updated:2024-04-01 15:20:29.0  )
BREAKING: సీఎం జగన్‌కు బిగ్ షాక్.. వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర బీసీ విభాగ అధ్యక్ష పదవికి రిజైన్ చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం, పార్టీ అధినేత జగన్‌కు ఆయన పంపారు. జంగాతో పాటు ఆయన వర్గం నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీకి రాజీనామా చేశారు. వైసీసీకి గుడ్ బై చెప్పిన జంగా.. ఈ నెల 5 లేదా 6న టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే టీడీపీ చీఫ్ చంద్రబాబుతో చర్చలు సైతం జరిపారు. చేరికకు గ్రీన్ సిగ్నల్ రావడంతో జంగా ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పారు. గురుజాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.

Read More..

ఏప్రిల్ ఫూల్ చేసిన CM జగన్.. జనసేన ట్వీట్ వైరల్ (వీడియో)

Advertisement

Next Story