వైసీపీ ఎమ్మెల్యేలు మందబలంతో విర్రవీగుతున్నారు : Nandamuri Balakrishna

by Seetharam |   ( Updated:2023-09-21 08:13:20.0  )
వైసీపీ ఎమ్మెల్యేలు మందబలంతో విర్రవీగుతున్నారు : Nandamuri Balakrishna
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మందబలంతో విర్రవీగుతున్నారు అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. అసెంబ్లీలో తాను చేయనిదానికి తనపై అసత్యాలు రుద్దుతున్నారని అన్నారు.రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తనకు మీసం చూపి తొడగొట్టారని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆ తర్వాతే తాను రియాక్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు. మంత్రి అంబటి రాంబాబు తన వృత్తిని అవమానించారని అన్నారు. తన వృత్తి తనకు తల్లితో సమానం అని చెప్పుకొచ్చారు. తన వృత్తిని అవమానిస్తేనే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని బాలకృష్ణ వివరణ ఇచ్చారు. అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత మీడియా పాయింట్ వద్ద నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా మంత్రి అంబటి రాంబాబు తన వృత్తిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కౌంటర్‌గానే తాను మీసం మేలేస్తూ తొడ కొట్టానని మరోసారి వివరణ ఇచ్చారు. ఆ సమయంలో తానే కాదు ఆ స్థానంలో ఎవరున్నా ఇలానే రియాక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు. తాను ఎవరికి భయపడననని హెచ్చరించారు. కేసులకు సైతం భయపడే ప్రసక్తే లేదని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Read More..

బావ కళ్లల్లో ఆనంద కోసమే మీసం తిప్పారు : బాలకృష్ణపై మంత్రి రోజా

Advertisement

Next Story